కౌటాలలో కొండచిలువ కలకలం

85చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో‌ కొండచిలువ కలకలం రేపింది. మిని స్టేడియం ఎదురుగా ఉన్న ఓ చెట్టుకు కొండచిలువ చుట్టుకుని ఉండటం గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవిశాఖ అధికారులకు, పాములు పట్టే వారికి సమాచారం అందజేశారు. పాములు పట్టే వ్యక్తి వచ్చి చెట్టుకు చుట్టుకున్న కొండచిలువను బయటకు తీసి అడవిలోకి వదిలేశారు. దీంతో స్తానికులు ఊపిరి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్