సిర్పూర్ మండలం హుడ్కిలీ గ్రామంలో శుక్రవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అర్ధరాత్రి దాటే వరకు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో కొలిచారు. బతుకమ్మ పాటల పై మహిళలు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. అనంతరం సమీపంలో వర్ధన్నదిలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.