కాగజ్నగర్: సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ట్రేస్.. బాధితునికి అప్పగింత
కాగజ్నగర్ పట్టణం బాలాజీనగర్ కు చెందిన పులుగం సదశివ తన ముబైల్ పోగొట్టుకుని టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. టౌన్ సీఐ పీ. రాజేంద్రప్రసాద్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ను ట్రేస్ చేసి గురువారం బాధితునికి అప్పగించారు. సీఐ మాట్లాడుతూ.. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని సీఐ సూచించారు.