Jan 03, 2025, 10:01 IST/
ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్!
Jan 03, 2025, 10:01 IST
ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ సేల్ ద్వారా రూ. 1,448 కే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ తరచుగా విమానాలలో ప్రయాణించే వారికీ, జీవితంలో కనీసం ఒకసారి విమానం ఎక్కాలని కలగన్న వారికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ న్యూ ఇయర్ సేల్ లో భాగంగా లైట్ ఆఫర్ కింద రూ.1,448, వాల్యూ ఆఫర్ కింద రూ.1,599 ధరలు ప్రకటించింది. బుకింగ్స్ 5 జనవరి 2025 వరకు చేయవచ్చు.