జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈనేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులు అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీని పొందుపర్చామని ఐఎండీ డైరెక్టర్ మనీశ్ రణాల్కర్ తెలిపారు. ప్రతీ 15 నిమిషాలకు ఒకసారి వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.