AP: అనంతపురంలో తమ బస్సులు దగ్ధం ఘటనకు సంబంధించి బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయసుకు తగ్గట్లు ఉంటే మంచిదన్నారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ నేతలపై అర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.