తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోందని శుక్రవారం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని.. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.