ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగి మృతి
ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామంలో బుధవారం మృతి చెందారు. ఇద్దరు యువకులు ఒక యువతి ఈత కోసం గ్రానైట్ క్వారీలో కి వెళ్లి లోతు తెలియక ముగ్గురు మునిగి మృతి చెందారు. వీరు ఖమ్మం జిల్లా వాసులు. అశ్వరావుపేట గ్రామానికి చెందిన ఇద్దరు, తిరుమల పాలెం మండలం జూపేడ గ్రామానికి చెందిన ఒకరు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది