ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఐస్‌క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ, ఫ్రూట్ నట్స్ ఫ్లేవర్స్ అని చాలా రకాలు ఉన్నాయి. అయితే ఢిల్లీలో వింత ఐస్‌క్రీమ్‌ను తయారుచేశారు. ఓ వ్యక్తి పచ్చి మిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసి.. దానిపై ఆకుపచ్చ సాస్ వేసి, అందులో కాస్త పాలు కలిపి.. చివరకు ఐస్‌క్రీమ్ తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.