జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.