భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల వివరాలా ప్రకారం దమ్మపేట మండలం పరిధిలోని అచ్యుతాపురం మార్గం పామాయిల్ తోటలో ప్రమాదవశాత్తు శ్రీపాద రామానుజ చారి (35) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.