భద్రాచలం ఐటిడిఎ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంటాక్ట్ ఉపాధ్యాయులను ఈ విద్యాసంవత్సరంనకు రెన్యువల్ కోరుతూ మంగళవారం నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవఅధ్యక్షులు శివనాయక్, అధ్యక్షులు ధర్మరాజు, కార్యదర్శి పసుపులేటి శ్రీను, కార్యవర్గ సభ్యుడు చరణ్ మాట్లాడుతూ... గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను ఈ విద్యాసంవత్సరం నాకు రెన్యువల్ చేయకుండా అధికారులు మొండివైఖరి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏపిఓ దృష్టికి తీసుకెళ్లినా, తమ సమస్యలను పట్టించుకోవడంలేదని తెలిపారు. గత సంవత్సరంలో పనిచేసిన 244 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులకు గాను కేవలం 166 మందిని రెన్యువల్ చేశారని మిగతా వారిని కూడా ఎలాంటి షరతులు లేకుండా రెన్యువల్ చేసే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని అధికారులను హెచ్చరించారు.