10 కిలోల గంజాయి సీజ్

8570చూసినవారు
10 కిలోల గంజాయి సీజ్
భద్రాచలం కూనవరం రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని శనివారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, ఫోన్లు, కారు విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపారు. సిబ్బంది బాలు, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్