తాలిపేరు గేట్ల ట్రయల్ రన్ కు సన్నద్ధం

70చూసినవారు
తాలిపేరు గేట్ల ట్రయల్ రన్ కు సన్నద్ధం
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో 25 గేట్లు ఆటోమేటిక్ విధానంలో లేస్తున్నాయా? లేదా? అన్నది బుధవారం ఏఈ ఉపేందర్ నిశితంగా పరిశీలించారు. గేట్ల ఆపరేటింగ్ విధానంలో లోపాలు ఏమాత్రం కనిపించలేదని పేర్కొన్నారు. ఎంత ఎత్తు కావాలంటే అంత వరకే ఆటో మేటిక్ విధానంలో గేట్లు లేస్తున్నాయన్నారు. కంట్రోల్ రూంలో సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేస్తున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లోనే అధికారికంగా ట్రయల్ వేస్తామని ఏఈ తెలిపారు.

సంబంధిత పోస్ట్