బూర్గంపాడు: నా చావుకి వారే భాద్యులు
బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామంలో ఓ గిరిజన మహిళా రైతు నూక రత్తమ్మ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సారపాకలోని ఐటీసీ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రి తమ పొలంలో పైప్ లైన్ వేస్తుండగా రత్తమ్మ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వారిని ప్రశ్నించిడంతో వంశీ, కోర్సా లక్ష్మి, ఐటీసీ యాజమాన్యం దౌర్జన్యానికి దిగి ఆమెను బెదిరించారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు, తన చావుకి వాళ్లే కారణమని తెలిపారు.