బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్ చెందిన బిసై సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు.