విద్యుత్ సరఫరాకు అంతరాయం
దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లబెల్లి ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా విషయంలో గురువారం అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్ శాఖ అధికారి మోహన్ రెడ్డి ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ లైన్ మరమ్మత్తుల పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి పనులను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.