దుమ్ముగూడెం: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
దుమ్ముగూడెం మండలం ముసలిమడుగు గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. వాగే సత్యం తన కుటుంబతో పత్తి చేనుకు వెళ్లగా సాయంత్రం సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. రూ. 55వేల నగదు, బంగారం దిద్దులు, బ్యాంకు ఖాతా పుస్తకం, పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్కార్థులు, వంట సామగ్రి, దుస్తులు తదితర సామగ్రి కాలిపోయాయని బాధితులు వాపోయారు.