గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా చేసిన రజత్‌కుమార్, ఎస్‌కే జోషి కాళేశ్వరం కమిషన్ ముందు బుధవారం విచారణకు హాజరయ్యారు. తమ్మడిహట్టి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చడంపై కమిషన్ ఆరా తీసింది. అయితే అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని CWC చెప్పిందని జోషి తెలిపారు. ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని విచారణ కమిషన్ ప్రశ్నించగా.. నాటి సీఎం, మంత్రుల నిర్ణయం మేరకు ప్రాజెక్టు స్థలం మారిందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదన్నారు.