బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి అని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. ప్రపంచ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని, కలరా, మలేరియా, విరేచనాలు, టైపాయిడ్ వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.