నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఏరియా కమిటీ సభ్యుడు మడివి అయిత భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. అయితల్ 2020 నుండి మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ, ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితుడై పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.