లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం తమ వాహనాలను వాడుకుని బకాయిపడిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఆటో ట్రాలీ యజమానులు శనివారం భారాస కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రముఖులు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. మాజీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లుకు, సంఘం యజమానులకు వాగ్వాదం కొనసాగింది. పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు వారితో చర్చించి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.