ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

80చూసినవారు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ అన్నారు. భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు అంకితభావంతో నడుచుకోవాలన్నారు. డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, ఆటోలకు టాప్ నంబర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్