ముత్యాలమ్మ ఆలయంలో వెండి అభరణాలు చోరీ
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయితీ ఆఫీస్ ఎదురు మరియు మెయిన్ రోడ్ లో గల ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో దొంగలు హల్చల్ చేశారు. మణుగూరు మండలంలో దేవాలయాలలో ఇది వరుసగా జరుగుతున్నటువంటి దొంగల బెడద, అంబేద్కర్ సెంటర్ నుండి పీవీ కాలనీ వరకు నిత్యం రద్దీగా ఉండేటటువంటి రోడ్డులో గల అమ్మవారి దేవాలయంలో దొంగలు పడి వెండి కండ్లు, వెండి ఆభరణాలు, గుడి పూజ సామాన్లు ఎత్తుకొని వెళ్లడంతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు,