భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం మణుగూరు మండల పరిధిలోని మల్లారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లారం గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.