ఆధార్ సెంటర్లు ప్రారంభించాలి

52చూసినవారు
ఆధార్ సెంటర్లు ప్రారంభించాలి
మణుగూరు మండలంలో ఆధార్ కేంద్రాలు లేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం సామాజిక కార్యకర్త కర్నె రవి తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ విషయమై చొరవ చూపి తక్షణమే మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన తహసిల్దార్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్