మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ సమీపంలో నిర్మించినటువంటి లోతు వాగు పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతు వాగు పై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు వర్షాకాలం రాకపోకలు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని దానిలో భాగంగా సుమారు 2కోట్ల యాభై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.