బూర్గంపాడు మండలం సారపాక పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కోతులు ఉండడంవల్ల ప్రతిరోజు కోతులు ఇళ్లల్లో చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను, చెట్లకున్న పండ్లను, కూరగాయలను తినడమే కాకుండా ఇంట్లో ఉన్న వ్యక్తులపై, పిల్లలపై తిరగబడుతూ నానా విధాలుగా కోతులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వీధి మహిళలు వాపోతున్నారు. ఈ విషయమై సారపాక మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ కి కోతుల బెడద నుండి కాపాడాలని మహిళలు వినతి పత్రం అందించారు.