మణుగూరు పోలీస్ స్టేషన్ లో 78వ స్వాతంత్య్ర వేడుకల ఎస్సై మేడాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, వారి త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని చెప్పారు. మనమంతా వారి కలలను సాకారం చేయాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఎస్ఐ మేడా ప్రసాద్ పేర్కొన్నారు.