మణుగూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల రూ 22 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగినది. శనివారం జూనియర్ కళాశాలలో సిసి రోడ్డును పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ, ఇదే జూనియర్ కళాశాలలో నేను చదువుకున్నానని, ఈ కళాశాలను గత ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే బిల్డింగ్ నిర్మాణం చేయించానన్నారు.