పినపాక మండలం తోగ్గూడెం గ్రామ శివారులోని వంతెన వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి కోతకు గురై సుమారు 6 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. అడుగు భాగంలోని మట్టి సైతం వరదకు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల శాఖ ఏఈ సురేశను వివరణ కోరగా వరదల కారణంగా ధ్వంసమైన రహదారుల మరమ్మతులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించామన్నారు.