నాగర్ కర్నూల్ జిల్లాలో గుట్టలు ధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన రిలేనిరహార దీక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్భంధంలో భాగంగా దీక్ష ప్రారంభానికి వెళుతున్న ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ లను వెల్దండ పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆవునూరి మధు సోమవారం అన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇల్లెందు న్యూడెమోక్రసీ కార్యాలయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.