గార్ల మండలం పాత పోచారం, తదితర ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు తెచ్చిన సిపిఎస్ విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఈ సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు శిల్పారాజ్ పేర్కొన్నారు.