కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఫార్ములా- ఈ కారు రేసు కేసులో తనను కావాలనే ఇరికించారని, ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఈ నెల 15న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.