వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నియమితులయ్యారు. నవంబర్ 8న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ నాలుగు టీ20లు ఆడనుంది. ఈ టూర్‌కు స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించనున్నట్లు బీసీసీఐ ఉన్నత అధికారి సోమవారం ధృవీకరించారు. లక్ష్మణ్‌తో పాటు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్, శుభదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్‌గా సౌతాఫ్రికాకు బయలుదేరతారు.