AP: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి అతడు హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్ నాయక్ మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.