రేవంత్ సర్కార్ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. కోరుట్లలో మంగళవారం జరిగిన 'రైతు మహా పాదయాత్ర'లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'కేసీఆర్ మళ్లీ వస్తాడు. మీ బాధలు తీరుస్తాడు. మళ్లీ కేసీఆర్ను అధికారంలోకి తెచ్చుకుందాం' అని వారితో చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.