కమలా హారిస్ కు మద్దతిస్తాం, ఆమె నవ్వు అందరినీ ఆకట్టుకుంటుంది: పుతిన్

54చూసినవారు
కమలా హారిస్ కు మద్దతిస్తాం, ఆమె నవ్వు అందరినీ ఆకట్టుకుంటుంది: పుతిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. నవంబర్ లో జరిగే ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కే తమ మద్దతు అని పుతిన్ గురువారం తెలిపారు. "జో బైడెన్ మాకు ఇష్టమైన అభ్యర్థి, అతను తప్పుకుని కమలా హారిస్ కు మద్దతు ఇచ్చాడు, కాబట్టి మేము హారిస్ కు ఎందుకు మద్దతివ్వకూడదు" అని పుతిన్ పేర్కొన్నారు. "ఆమె నవ్వు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ నవ్వు ప్రతిదీ నియంత్రణలోనే ఉందనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది" అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్