విజయవాడలో మెకానిక్ షాపులకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ముంపు ప్రాంతాలకు సమీపంలోని బైక్ మెకానిక్ షెడ్ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. గత మూడు రోజులుగా వరదలోనే ఉన్న వాహనాల ఇంజిన్లలోకి నీరు చేరి అవి పాడైపోయాయి. దీంతో వాహనదారులు మెకానిక్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రతి మెకానిక్ షెడ్ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఒక బైక్ రిపేర్ కు కనీసం 2-3 గంటలు పడుతుందని, షాపు ముందున్న వాహనాలు రిపేర్ చేయాలంటే 4-5 రోజులు పట్టవచ్చని మెకానిక్ లు చెబుతున్నారు.