ఎర్ర నేలల్లో ద్రాక్ష పంటను సాగు చేస్తే.. ఏడాదికి 30 నుండి 40 తడులు అవసరం అందించాల్సి ఉంటుంది. శీతాకాలంలో వెయ్యి లీటర్ల నీరు, వేసవి కాలంలో 2000 లీటర్ల నీరు ఒక్క మొక్కకు అవసరం అవుతుంది. ద్రాక్ష కత్తిరింపుల నుంచి ఎరువులు వేసిన వెంటనే 2 నుండి 3 తడులు అందించాలి. ఆ తర్వాత వెంటనే 3 నుండి 4 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. ద్రాక్ష పండ్లు తయారయ్యే సమయంలో 8 నుండి 10 రోజుల వరకు నీటి అందించడం ఆపాలి.