ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 2,62,462 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,65,233 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరోవైపు వరద పెరగడంతో నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తారు.