పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్ సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీపై అమెరికాలో నమోదైన అవినీతి కేసు అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్, ఛైర్మన్ చెప్పినా ఎంపీలు వినకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.