తన పెళ్లిపై నటి కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన చేశారు. తాను ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 15 ఏళ్లుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని తెలిపారు. ‘AntoNY x KEerthy ( Iykyk)’ అని క్యాప్షన్ ఇచ్చారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. కాగా చిన్నప్పటి నుంచి వారి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.