లారీ డ్రైవర్‌ను కత్తులతో నరికేశారు (వీడియో)

77చూసినవారు
తమిళనాడులోని వేలూరులో బుధవారం దారుణం జరిగింది. ముత్తుకృష్ణన్ (33) అనే వ్యక్తి లారీ డ్రైవర్. మెకానిక్ షాపు వద్ద రోడ్డుపై తన లారీ రిపేర్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు వచ్చారు. ఒక్కసారిగా వేట కొడవళ్లతో ముత్తుకృష్ణన్‌పై దాడి చేశారు. దుండగుల దాడిలో ముత్తుకృష్ణన్‌కు బలమైన గాయాలయ్యాయి. అతడి చేతి వేళ్లు తెగిపడ్డాయి. బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పాతకక్షల కారణంగా ఈ దాడి జరిగినట్లు తేలింది.

ట్యాగ్స్ :