ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత సాధించింది. చిమ్మ చీకట్లో విమానాన్ని సురక్షితంగా దింపింది. తూర్పు సెక్టార్‌లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్ పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోల్లో అధునాతన గ్రౌండ్‌లో ఐఏఎఫ్ C-130J విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది.