రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలని, చదువు విషయంలో ఒత్తిడి పెంచొద్దని సూచించారు. అలాగే, కొన్ని ఆత్మహత్య కేసుల వెనుక ప్రేమ వ్యవహారాలూ ఉన్నాయని వ్యాఖ్యానించారు.