ప్రేమ వివాహం.. ఉరి వేసుకున్న యువతి (వీడియో)

49246చూసినవారు
యూపీలోని మొరాదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఫుజైల్ అనే యువకుడికి ముంబైకి చెందిన హర్షదా(25) అనే యువతితో వివాహమైంది. భర్త ముస్లిం కావడంతో హర్షదా ఫాతిమాగా మారింది. వీరికి 6 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో హర్షద తన తల్లికి ఫోన్ చేసి.. కొడుతున్నారని చెప్పి ఉరేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :