మే నెల నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం: మంత్రి నాదెండ్ల

53చూసినవారు
మే నెల నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం: మంత్రి నాదెండ్ల
మే నెల నుంచి పాఠశాలలు తెరిచే సమయానికి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 1 లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే మే నెలలో తల్లి వందనం పేరుతో రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్