మాగనూరు ఘటన.. హైకోర్టు విచారణ వాయిదా

73చూసినవారు
మాగనూరు ఘటన.. హైకోర్టు విచారణ వాయిదా
మాగనూరు ఘటనపై దాఖలైన పిటిషన్‌ ను హైకోర్టు విచారించింది. విద్యార్థులు బయటి చిరుతిళ్లు తిని అస్వస్థతకు గురయ్యారని.. వారిని ఆసుపత్రికి తరలించామని AAG తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలుపగా.. అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి పాఠశాలలో ఘటనలపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్