గట్టు మండల కేంద్రంలో ఎంపీవో రవి కుమార్ కి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మెమోరాండం ఇచ్చారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ గట్టు మండల కేంద్రంలోని వివిధ గ్రామపంచాయతీలలో 5, 6 నెలల నుండి జీతాలు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ప్రతినెల 5వ తారీఖు లోపు వేతనాలు ఇవ్వాలన్నారు.